Nizam Sagar Canal: స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాం సాగర్ కాల్వలో పడి గల్లంతైన ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం చోటుచేసుకుంది. వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించారు. వర్ని మండలంలోలని అఫందీఫారం వద్ద నిజాంసాగర్ కాలువలో స్నానానికి వెళ్లి మోచి నారాయణ(20) అనే యువకుడు గల్లంతు కాగా.. ఆయనను కాపాడే యత్నంలో ఆ యువకుడి పెద్దనాన్న విజయ్(50) కూడా గల్లంతయ్యారని ఎస్సై తెలిపారు.
Read Also: CM Revanth Reddy: నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ సమావేశం
చందూరు మండల కేంద్రానికి సమీపంలో గల నిజాం సాగర్ ప్రధాన కాలువలో మొండి విష్ణువర్ధన్(25) గల్లంతయినట్లు ఎస్సై పేర్కొన్నారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలాలకు చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. చందూరుకు చెందిన మొండి విష్ణు (21) నిజామాబాద్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఫ్రెండ్స్‌తో కలిసి నిజాంసాగర్ కాల్వలో స్నానానికి వెళ్లాడు. కట్టమీది నుంచి కాల్వలోకి దూకడంతో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయాడు. గమనించిన ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.