NTV Telugu Site icon

Tragedy: మరో తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం

Tragedy

Tragedy

Tragedy: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్‌, మానిక్ మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారి కుటుంబాలను విషాదఛాయలు అలుముకున్నాయి. రాఘవేంద్ర టీచర్‌గా పని చేస్తుండగా.. ఆ పిల్లలు స్కూల్‌ విద్యార్థులుగా గుర్తించారు.

Read Also: Health: ప్రతి నలుగురిలో ఒకరికి ఈ సమస్య.. సకాలంలో చికిత్స తీసుకోకపోతే చాలా డేంజర్

అసలేం జరిగిందంటే.. నంబూరులోని ఓ స్కూల్‌లో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకుని రాఘవేంద్ర గ్రామానికి బయలు దేరాడు. మార్గ మధ్యలో ఉన్న మురుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ఆగకుండా వెళ్లడంతో వరద ఉద్ధృతి కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న రాషువేంద్రతో పాటు ఇద్దరు పిల్లలు సాత్విక్‌, మానిక్‌లు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సాయంతో కారుతో పాటు మృతదేహాలను బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

Show comments