NTV Telugu Site icon

Three Newborns Died: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా..?

Newborns

Newborns

Three Newborns Died: ప్రాణం పోసిన దైవం ఉన్నదో లేదోగాని ప్రాణాలను నిలిపే డాక్టర్ ని మాత్రం దైవంతో సమానం అంటారు, ఇంకా హాస్పిటల్ లో పనిచేసే నర్స్ లు కంపౌండర్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు సేవ భావానికి నిలువెత్తు సాక్షాలుగా నిలుస్తారు. కానీ, మంచిలో చెడు కూడా ఉంటది అన్నట్లు కొన్ని హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది తీరు ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తుంది, వాళ్ళు చేసే చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.

Read Also: TSRTC Merger Bill: ఆర్టీసీ విలీనం.. గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ

నంద్యాల శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతూ ముగ్గురు నవ జాత శిశువులు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. రెండురోజుల క్రితం భనగాన పల్లె నుండి గోపి మరియు శ్రావణి అనే దంపతులు కవలలతో ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చారు, చికిత్స పొందుతూ కవలల్లో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయభాను అనే మరో తల్లి ప్రైవేట్ హాస్పిటల్ నుండి తన శిశువుని తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ కి రాగ ఈ శిశువు కూడా చికిత్స పొందుతూ చనిపోయింది. శిశువు శరీరంలోకి పాలు వెళ్లి మరో శిశువు మృతి చెందినట్టు చెబుతున్నారు.. అయితే, ఆక్సిజన్ సకాలంలో అందకే తన బిడ్డ చనిపోయిందని తల్లి లక్ష్మి దేవి విలపించగా, హాస్పిటల్ సిబంది నిర్లక్ష్యమే ఈ మృతులకు కారణం అంటూ వారి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే.. తమ పిల్లలు ప్రాణాలు విడిచేవారు కాదని చెబుతున్నారు.