Site icon NTV Telugu

AP Coronavirus Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!

Coronavirus Ap

Coronavirus Ap

మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళకు పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయింది. చిలకలూరిపేటకు చెందిన వృద్దుడు, బాపట్లకు చెందిన మరో‌ మహిళకు పాజిటివ్‌గా తేలింది.

Also Read: PBKS vs RCB: అదే జరిగితే.. ఫైనల్‌కు పంజాబ్‌!

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ సోకిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంటికి పంపి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముగ్గురికి కరోనా సోకినట్లు ఆసుపత్రి వైద్యులు.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజా కేసులతో కలిపి ఏపీలో దాదాపు కేసుల సంఖ్య 10కి చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1000ని దాటడం కలకలం రేపుతోంది. అత్యధికంగా కేరళలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన 84 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందారు.

Exit mobile version