NTV Telugu Site icon

Mumbai: దీపావళి బాంబులు పేల్చొద్దన్నాడని కత్తితో పొడిచి చంపేశారు

Mumbai: దీపావళి వేళ ముంబైలో దారుణ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జీవితాల్లో వెలుగులు నింపాల్సిన దీపావళి..నలుగురి జీవితాల్లో అంధకారం నింపాయి. గ్లాసు బాటిల్‌లో బాంబులు కాల్చడం వల్ల వాటి ముక్కలు అందరికీ గుచ్చుకునే ప్రమాదం ఉండడంతో.. కాబట్టి వాటిని కాల్చొద్దన్న యువకుడిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని ఇరవై ఒక్క ఏళ్ల సునీల్ శంకర్ నాయుడుగా గుర్తించారు. ముంబైలోని శివాజీ నగర్ లో 12 ఏళ్ల బాలుడు గ్లాస్ బాటిల్ లో టపాసులు పెట్టి పేలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండడంతో గమనించిన సునీల్ నాయుడు అక్కడికి వచ్చి ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read Also: Samantha: రేటు పెంచిన సమంత.. అన్ని కోట్లిస్తేనే చేస్తా అంటున్న బ్యూటీ

గొడవను చూసిన బాలుడి అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.

Read Also: Nabha Natesh: బాలి బీచ్ లో ఇస్మార్ట్ బ్యూటీ అందాల ఆరబోత

ఇటీవలి కాలంలో మైనర్లు చేస్తున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారిని వద్దు అంటే చాలు… రెచ్చిపోతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు అన్నింట్లోనూ కనిపిస్తున్నారు. ఇది చాలా భయాందోళనలు కలిగించే విషయం. అలా మైనర్లు క్షణికావేశంలో దీపావళిని చీకటిమయం చేశారు.

Show comments