Mumbai: దీపావళి బాంబులు పేల్చొద్దన్నాడని కత్తితో పొడిచి చంపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: దీపావళి వేళ ముంబైలో దారుణ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జీవితాల్లో వెలుగులు నింపాల్సిన దీపావళి..నలుగురి జీవితాల్లో అంధకారం నింపాయి. గ్లాసు బాటిల్‌లో బాంబులు కాల్చడం వల్ల వాటి ముక్కలు అందరికీ గుచ్చుకునే ప్రమాదం ఉండడంతో.. కాబట్టి వాటిని కాల్చొద్దన్న యువకుడిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని ఇరవై ఒక్క ఏళ్ల సునీల్ శంకర్ నాయుడుగా గుర్తించారు. ముంబైలోని శివాజీ నగర్ లో 12 ఏళ్ల బాలుడు గ్లాస్ బాటిల్ లో టపాసులు పెట్టి పేలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండడంతో గమనించిన సునీల్ నాయుడు అక్కడికి వచ్చి ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read Also: Samantha: రేటు పెంచిన సమంత.. అన్ని కోట్లిస్తేనే చేస్తా అంటున్న బ్యూటీ
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
గొడవను చూసిన బాలుడి అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.
Read Also: Nabha Natesh: బాలి బీచ్ లో ఇస్మార్ట్ బ్యూటీ అందాల ఆరబోత
ఇటీవలి కాలంలో మైనర్లు చేస్తున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారిని వద్దు అంటే చాలు… రెచ్చిపోతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు అన్నింట్లోనూ కనిపిస్తున్నారు. ఇది చాలా భయాందోళనలు కలిగించే విషయం. అలా మైనర్లు క్షణికావేశంలో దీపావళిని చీకటిమయం చేశారు.
- Tags
- Diwali
- FireCrackers
- minors
- mumbai
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?