Site icon NTV Telugu

MPs Suspend: హాకా నిరసన.. పార్లమెంటు నుంచి ముగ్గురు ఎంపీలు సస్పెండ్..!

Mps Suspend

Mps Suspend

MPs Suspend: న్యూజిలాండ్‌లో మావోరి పార్టీకి చెందిన ముగ్గురిని ఎంపీలను హాకా నిరసనల నేపథ్యంలో పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు. గత సంవత్సరం నవంబరులో జరిగిన ఓ కీలక బిల్లుపై ఓటింగ్ సమయంలో ఈ ఎంపీలు హాకా అనే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. మావోరి పార్టీ సహ అధ్యక్షులు రావిరి వైతితి, డెబ్బీ న్గారెవా పాకర్‌కు 21 రోజులపాటు, న్యూజిలాండ్‌లో ప్రస్తుతానికి అత్యంత పిన్న వయసు ఎంపీ అయిన హనా-రావితి మైపీ-క్లార్క్‌కు 7 రోజులపాటు నిషేధం విధించారు. ఇది న్యూజిలాండ్ పార్లమెంటు చరిత్రలో ఎంపీలను నిషేదినచడం అతి పెద్ద నిషేధ కాలంగా నిలిచింది.

Read Also: Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!

ఈ నిషేధాలు 2023 నవంబర్‌లో ప్రవేశపెట్టిన ట్రీటీ ప్రిన్సిపుల్స్ బిల్ పై జరిగిన నిరసనల కారణంగా విధించబడ్డాయి. ఈ బిల్ న్యూజిలాండ్‌కు ఆదిపత్య గుర్తుగా ఉన్న 1840 ట్రీటీ ఆఫ్ వైటంగీకి సంబంధించిన మౌలిక సిద్ధాంతాలను మళ్లీ మాట్లాడేలా చేసింది. ఈ బిల్లుపై మావోరి ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఈ బిల్‌ పై ఓటింగ్ సమయంలో హనా రావితి మైపీ-క్లార్క్ బిల్లును చింపి హాకా పాట పాడడం ప్రారంభించారు. వెంటనే వైతితి, పాకర్ హాకా నృత్యంతో ఆమెకు మద్దతుగా నిలిచారు.

Read Also: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!

ఈ సందర్బంగా మైపీ-క్లార్క్ మాట్లాడుతూ.. ఒక ఎంపీ శాసనసభలో తప్పు మాట్లాడినా, స్టాఫ్‌ పై చెయ్యి వేసినా, పార్లమెంట్ మెట్లు కారుతో ఎక్కినా వారిని కేవలం హెచ్చరికతో వదిలేస్తారు. కానీ, మేము దేశానికి ఆదారంగా ఉన్న ఒప్పందాన్ని సమర్థించామంటే మమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ బిల్లును ఏప్రిల్‌లో న్యూజిలాండ్ పార్లమెంట్ ఖండిస్తూ తిరస్కరించింది. అయినా కూడా ఈ ఘటన మావోరి హక్కులపై ప్రభుత్వ వైఖరిని ప్రదర్శించిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Exit mobile version