NTV Telugu Site icon

Clash Between two Groups: రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం.. ముగ్గురు మృతి

Clash

Clash

Clash Between two Groups: రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు తెగబడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Fire Accident: ఢిల్లీ భగీరథ్ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం

భరత్‌పూర్ పోలీసుల ప్రకారం.. భరత్‌పూర్ జిల్లాలోని కుమ్హెర్‌ తాలూకాలో గల సక్రౌరా గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాత్మక పోరాటంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సముందర్, లఖన్ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు భరత్ పూర్‌ ఏఎస్పీ అనిల్ మీనా వెల్లడించారు. మృతులు ముగ్గురిని సముందర్, ఈశ్వర్, గజేంద్రగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ భరత్‌పూర్ అనిల్ మీనా తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.