మనం ఎంత కాలం ఆరోగ్యంగా జీవిస్తామో తెలుసుకోవడానికి ఖరీదైన ల్యాబ్ రిపోర్టులు అవసరం లేదు, మన శరీరంలోని మూడు కీలక సంకేతాలను గమనిస్తే సరిపోతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్‌లు వివరిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యూలు దీర్ఘాయువును (Longevity) నిర్ణయించే మూడు ప్రధాన బయోమార్కర్ల గురించి కీలక విషయాలను పంచుకున్నారు.
అందులో మొదటిది విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం (Resting Heart Rate), రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), మూడోది రక్తపోటు (Blood Pressure) ఇవి మూడు అనేవి మన అంతర్గత ఆరోగ్యానికి నిజమైన అద్దాలని పేర్కొన్నారు. ఈ మూడు అంకెలు స్థిరంగా ఉన్నాయంటే మీ నాడీ వ్యవస్థ, గుండె పనితీరు అత్యంత సమర్థంగా ఉన్నాయని అర్థం.
తక్కువ రెస్టింగ్ హార్ట్ రేట్ ఉండటం వల్ల గుండె పై ఒత్తిడి తగ్గుతుందని, అలాగే అధిక HRV ఉంటే మీ శరీరం ఒత్తిడి నుండి వేగంగా కోలుకుంటుందని డాక్టర్‌లు తెలిపారు. కేవలం కఠినమైన డైట్లు లేదా వ్యాయామాలు మాత్రమే కాకుండా, నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరించడం.. మెటబాలిక్ హెల్త్ పై దృష్టి పెట్టడం ద్వారా ఈ బయోమార్కర్ లు మెరుగుపరుచుకోవచ్చు. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, మన జీవసంబంధ వయస్సును (Biological Age), భవిష్యత్తులో రాబోయే గుండె జబ్బుల ముప్పును ముందే హెచ్చరించే సంకేతాలని డాక్టర్‌లు స్పష్టం చేశారు. మూల కారణాలను గుర్తించి జీవనశైలిని మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు వైద్యూలు.
