MLAs Resign: హిమాచల్‌ప్రదేశ్‌లో కీలక పరిణామం.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును తన్నుకుపోయింది. ఈ ఘటన ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. ముగ్గరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ (హమీర్పూర్ నియోజవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో విపక్ష నేత జైరామ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు. అనంతరం తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. హోషియార్ సింగ్ ఈ విషయం మీడియాకు తెలియజేశారు. తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశామని, బీజేపీలో చేరనున్నామని చెప్పారు. బీజేపీ టిక్కెట్‌పై తాము పోటీ చేయనున్నట్టు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో ప్రభుత్వం ఇరాకటంలో పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి. అనంతరం లక్కీ డ్రా తీయడంతో రాజ్యసభ సీటును బీజేపీకి గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఆరుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల ఆ నియోజకవర్గాలకు ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తాజాగా మరో ముగ్గురు రాజీనామా చేశారు. వీరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం మరింత సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!