Viral Video : ప్రస్తుతం స్త్రీలు ఏ విషయంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. వాళ్ళు కూడా అంచెలంచెలుగా మగవాళ్లతో భుజం భుజం కలిపి నడుస్తున్నారు. మగవాళ్లలాగే బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. కానీ ఒక్కోసారి స్టంట్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బైక్‌లు నడుపుతూ హఠాత్తుగా ప్రమాదాలకు గురవుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తూ కచ్చితంగా కడుపుబ్బా నవ్వడం ఖాయం.
Read Also:Akshay Kumar : తొలిసారి ఓటు వేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?
ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒకే బైక్‌పై ఎక్కడికో వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ నేరుగా డ్రైన్‌లోకి దూసుకెళ్తుంది. ఆ తర్వాత వారి శరీరమంతా డ్రైన్‌లోని మురుగుతో నిడిపోతుంది. ముగ్గురు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడొచ్చు. వారంతా పూర్తిగా బురదలో స్నానం చేసినట్లు కనిపిస్తోంది. సమీపంలోని ఇద్దరు వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కాలువలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వీడియోలో చూపించలేదు.
Read Also:Intelligence Report: కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ సమయంలో దాడులు జరిగే ఛాన్స్..
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @PalsSkit అనే ఐడితో షేర్ చేయబడింది . వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు పలు రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘రోడ్డుపై డ్రెయిన్ ఎందుకు వేసారు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే, ‘మందుబాబుల కంటే అధ్వాన్నంగా ఉంది వీళ్ల పరిస్థితి అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంకో నెటిజన్.. ‘వారు ఆడవారు, వారు ఏదైనా చేయగలరు’ కామెంట్ చేయగా, ‘మధ్యలో వచ్చిన కాలువ తప్పు’ అంటూ మరొకరు చమత్కరించారు.
पापा की परी है ये कही जाए कोई कुछ नही बोलेगा 💃🛵 pic.twitter.com/oYObS0VxIL
— Reetesh Pal (@PalsSkit) May 17, 2024
