NTV Telugu Site icon

FIFA World Cup Final: తుదిపోరుకు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్‌

Fifa World Cup

Fifa World Cup

FIFA World Cup Final: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ తుదిదశకు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌, మాజీ ఛాంపియన్‌ జట్లూ ఫైనల్‌లో టైటిల్‌ కోసం తలపడేందుకు సిద్ధం అయ్యాయి. అయితే తుదిపోరుకు ముందే ఫ్రాన్స్‌కు భారీ దెబ్బ తగిలింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.30 గంటలకు టైటిల్‌ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి. కానీ ఫ్రాన్స్ ఆటగాళ్లకు అనారోగ్యం బెడద ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆదివారంమే ఫైనల్ కావడంతో అభిమానుల్లో తెలియని అలజడి మొదలైంది. మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఫ్రాన్స్‌ కూడా ఉత్సాహం ఉంది. కానీ ఫ్రాన్స్‌ స్టార్‌ డిఫెండర్లు రాఫెల్ వరానె, ఇబ్రమాహి కొనాటెతో పాటు అటాకర్‌ కింగ్‌స్లే కోమన్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

వీరు ముగ్గురు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ట్రైనింగ్ సెషన్‌లోనూ ఈ ముగ్గురు ఆటగాళ్లు పాల్గొనలేదు. దీంతో ఈ ముగ్గురు శుక్రవారం తమ ప్రాక్టీస్‌ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. కాగా మొరాకోతో సెమీఫైనల్లో ఫ్రాన్స్‌  సబ్‌స్టిట్యూట్‌గా కోమన్‌ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోమన్‌ అవసరం ఫ్రాన్స్‌కు రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మొరాకోను ఫ్రాన్స్‌ 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. వరానె, ఇబ్రమాహి కొనాటేల అనారోగ్యం ముఖ్యంగా ఫ్రాన్స్ జట్టును కలవరపెడుతోంది. ఎందుకంటే వీరిద్దరూ కీలకమైన ఆటగాళ్లు. మొరాకోతో జరిగిన సెమీఫైనల్‌కు దయోట్ ఉపమెకానో స్థానంలో జట్టులోకి వచ్చిన కొనాటే అద్భుత ప్రదర్శన చేశాడు. ఫ్రాన్స్‌ డిఫెన్స్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇక ఇదే విషయంపై ఫ్రాన్స్ ఫార్వార్డర్లు రాండల్ కోలో, డెంబెలే స్పందించారు.

100 టెస్టులు ఆడిన టీమిండియా ఆటగాళ్లు వీళ్లే..!!

వీరు ముగ్గురు స్వల్ప వైరల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది. అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు కష్టాలు తప్పని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న అర్జెంటీనాను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా మెస్సి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎంబప్పేతో కలిసి గోల్డెన్ బూట్ రేసులో నిలిచాడు.

Show comments