Site icon NTV Telugu

Hyderabad: అంబర్పేట్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్..

Bride Suicide

Bride Suicide

Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇంట్లో రామ్ రాజ్ (55), మాధవి (50) ఇద్దరు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు శశాంక్ మాత్రం మణికట్టు కట్ చేసుకుని సూసైడ్‌కి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆత్మహత్య పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రామ్ రాజ్‌కు స్థానికంగా హోటల్ బిజినెస్ ఉన్నాయి. ఇతనికి వ్యాపార లావాదేవీల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.

READ MORE: Student Suicide: ఇన్ఫోసిస్లో రూ. 17 లక్షల ప్యాకేజీ.. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సూసైడ్..

Exit mobile version