NTV Telugu Site icon

AP Weather: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

Heavy Rains

Heavy Rains

AP Weather: ఇటీవల ఏపీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని ప్రకటించింది. మంగళ, బుధ, గురు వారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Read Also: Tirupati: మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిపై థియేటర్‌లో హత్యాయత్నం.. నిందితులు అరెస్ట్

పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Show comments