NTV Telugu Site icon

ICC: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న భారత మాజీ స్పిన్నర్..

Icc

Icc

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు గొప్ప సన్మానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, డయానా ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్‌ల పేర్లతో కూడిన హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండియాకు చెందిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2009 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. అప్పటి నుండి చాలా మంది గొప్ప ఆటగాళ్లను గౌరవించారు.

Read Also: Ongole: తెగిన చెరువు కట్ట.. రోడ్డుపై మూడు అడుగుల వరద నీరు

డివిలియర్స్ కెరీర్‌లో 114 టెస్ట్ మ్యాచ్‌లలో 8,765 పరుగులు.. 228 వన్డేలలో 9,577 పరుగులు, 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 1,672 పరుగులు చేశాడు. 463 క్యాచ్‌లు పట్టగా, 17 స్టంపింగ్స్ చేశాడు. డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అలిస్టర్ కుక్ 2006 నుండి 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. అతను 161 టెస్టులు, 92 వన్డేలు, 4 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 12,472, వన్డేల్లో 3,204, టీ20ల్లో 61 పరుగులు చేశాడు. 38 అంతర్జాతీయ సెంచరీలతో పాటు, 76 హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ నీతూ డేవిడ్ 10 టెస్టుల్లో 41 వికెట్లు తీయగా, 97 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది. 2006లో భారత మహిళల క్రికెట్ జట్టు తరపున ఆమె తన చివరి మ్యాచ్ ఆడింది.

Read Also: High Court : ఐఏఎస్‌లకు దక్కని ఊరట.. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలన్న హైకోర్టు

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నీతూ మాట్లాడుతూ.. ఈ జాబితాలో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ స్థాయికి చేరుకోవడం తనకు చాలా ప్రత్యేకమైన ప్రయాణం అని చెప్పింది. అన్ని కాలాలలోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు హాల్ ఆఫ్ ఫేమర్‌గా చేర్చబడటం వినయంగా ఉందన్నారు. ఈ ప్రత్యేకమైన క్లబ్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నానని తెలిపింది.