Tragedy: నారాయణపేట జిల్లా బోయిన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి సురేఖ కూడా ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో ఒకేసారి నలుగురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చిన్నారులు విజయ్(11), లిఖిత(10), వెంకటేష్(11)లుగా గుర్తించారు.
Read Also: DGP Anjani Kumar: పోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించేందుకు సరికొత్త విధానం.. ప్రకటించిన డీజీపీ
వీరు నీటిలో మునిగిపోతుండగా మమత అనే అమ్మాయి చూసి ఊళ్ళో వారికి సమాచారం అందించింది. కానీ గ్రామస్థులు అక్కడికి చేరుకునే లోపే చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతి చెందిన ముగ్గురు పిల్లలు కూడా 10 ఏళ్ల లోపు వారే. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
