Site icon NTV Telugu

Cars with high mileage: ఈ కార్లు రోజువారీ ప్రయాణానికి బెస్ట్.. మైలేజీలో తోపు

Tata

Tata

రోజూ కారు ప్రయాణాలు చేసే వారు ఉంటారు. ఆఫీస్ లకు వెళ్లడానికి.. వ్యాపార సంబంధిత పనుల కోసం కార్లలో తిరుగుతుంటారు. రోజు వారీ ప్రయాణాల కోసం మంచి మైలేజీ ఇచ్చే కారు ఉంటే ఆర్థిక భారం తప్పుతుంది. అందుకే ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కొనాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం సూపర్ మైలేజీ అందించే కార్లు అందుబాటులో ఉన్నాయి. 27 కి.మీ నుంచి 34 కి.మీ మైలేజీని ఇచ్చే మూడు కార్ల గురించి తెలుసుకుందాం.

Also Read:Srinidhi Shetty: రామాయణంలో సీత పాత్ర రిజెక్షన్.. అలా HIT 3లో భాగమయ్యా

మారుతి సుజుకి సెలెరియో CNG

ఇది మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు. దీని CNG పవర్‌ట్రెయిన్ ప్రతి కిలోగ్రాము CNGకి 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 998 cc, 3 సిలిండర్ ఇన్‌లైన్, 4 వాల్వ్/సిలిండర్, DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 56 bhp శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని అన్ని వేరియంట్లలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీనితో పాటు, ప్రయాణీకుల భద్రత కోసం, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు సెలెరియోలో అందుబాటులో ఉన్నాయి. దీని CNG పవర్‌ట్రెయిన్ ధర రూ. 6,89 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Also Read:Ambati Rambabu: చంద్రబాబు హీరో కాదు.. విలన్..!

టాటా టియాగో CNG

టాటా మోటార్స్ కు చెందిన ఈ ప్రసిద్ధ కారు ఒక కిలోగ్రాము CNG తో 26.49 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇది 1199 cc, 3 సిలిండర్ ఇన్‌లైన్, 4 వాల్వ్/సిలిండర్, DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 74 bhp శక్తిని, 96.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ISOFIX సపోర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. భారతదేశంలో టాటా టియాగో CNG ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.

Also Read:V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..

మారుతి సుజుకి ఆల్టో K10 CNG

మారుతి సుజుకిలో ఇదే అత్యంత చౌకైన కారు. దీని CNG పవర్‌ట్రెయిన్ ప్రతి కిలో CNGకి 33.40 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఇది 998 cc, 3 సిలిండర్ ఇన్‌లైన్, 4 వాల్వ్/సిలిండర్, SOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 56 bhp శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు దాని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర భద్రతా లక్షణాలతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. భారత మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో K10 CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.89 లక్షలకు అందుబాటులో ఉంది.

Exit mobile version