NTV Telugu Site icon

Taliban : తాలిబన్ల అదుపులో ముగ్గురు బ్రిటన్‌ జాతీయులు

Afghanisthan

Afghanisthan

అఫ్ఘానిస్థాన్ లో బ్రిటన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను తాలిబన్లు బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా,, తాజాగా మరొకరు ఎంతకాలం నుంచి నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు చెందిన నాన్ ప్రాఫిట్ గ్రూప్ ప్రెసీడియమ్ నెట్ వర్క్ వెల్లడించింది. బందీలుగా ఉన్నవారిలో బందీలుగా ఉన్నవారిలో చారిటీ వైద్యుడైన 53 ఏండ్ల కెవిన్ కార్న్ వెల్, యూట్యూబ్ స్టార్ మైల్స్ రౌట్ లెడ్జ్, మరొకరి పేరు తెలియనప్పటికీ.. అతడు హోటల్ మేనేజర్ అని స్థానిక మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.

Also Read : Drugs Seized: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..

కాగా, బంధీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రెసీడియమ్ నెట్ వర్క్ తెలిపింది. అపార్థం చేసుకోవడం వల్లే వారిని బంధీలుగా పట్టుకున్నారాని, విడుదల చేయాలని తాలిబన్లను కోరారు. ముగ్గురి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. గతేడాది నలుగురు బ్రిటన్ జాతీయులతో పాటు వెటరన్ టీవీ కెమెరామెన్ ను తాలిబన్లు విడిచిపెట్టారు. వారిని ఆరు నెలలకు పైగా తమ అధీనంలో బంధీలుగా ఉంచుకున్నారు.

Also Read : Jamiat Ulama I Hind : స్వలింగ పెళ్లిళ్లు భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం

గత కొంత కాలంగా తాలిబన్ల బ్రిటన్ పౌరులే టార్గెట్ గా చేసి వారిని బంధీలుగా చేస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలని తెలుపుతున్నారు. కిడ్నాప్ అయిన వారి కుటుంబసభ్యులు తాలిబన్లపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ వారిని విడుదల చేయాలని కోరుతున్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోవాలి తప్ప ఇలా పౌరులను అపహరించడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.