Arrest: బబుల్‌గావ్ తాలూకా మిత్నాపూర్‌లో ఇసుక వ్యాపారి, ప్రహార్ పార్టీ కార్పొరేటర్ అనికేత్ గవాండే హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. ఇసుక వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడే అనికేత్‌ను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ముగ్గురిని బబుల్‌గావ్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులను సద్దు అలియాస్ సాదిక్ముల్లా సలీం ముల్లా, గోలు అలియాస్ సమీర్ముల్లా సలీముల్లా, సోను అలియాస్ అబిద్ముల్లా సలీముల్లాగా గుర్తించారు.
Read Also: Goa Crime: దారుణం.. గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ ఫ్యామిలీపై కత్తులతో దాడి
అనికేత్ గవాండే సోదరుడు శుభం గవాండే పాత వ్యాపారంలో డబ్బులు డిమాండ్ చేసేందుకు సద్దు అలియాస్ సాదిక్ముల్లా సలీం ముల్లా, గోలు అలియాస్ సమీర్ముల్లా సలీముల్లా, సోను అలియాస్ అబిద్ముల్లా సలీమ్ముల్లా వద్దకు వెళ్లాడు. ఇంతలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో శుభమ్ గవాండే తన సోదరుడు అనికేత్ గవాండేకు ఫోన్ చేశాడు. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో కార్పొరేటర్ అనికేత్ గవాండే ఛాతీపై పదునైన కత్తితో పొడిచాడు. ఈ దాడిలో అనికేత్ రక్తపు మడుగులో పడి చనిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11.30 నుంచి 12 గంటల మధ్య జరిగింది. ఈ ఘటన కారణంగా నేడు బబుల్‌గావ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొని వ్యాపారులు తమ సంస్థలను మూసివేశారు. ఇసుక అక్రమ రవాణా కారణంగానే ఈ హత్య జరిగింది.
Read Also: Corporater: అంచెలంచెలుగా ఎదిగాడు.. ఆఖరికి కుక్క చావు చచ్చాడు