Site icon NTV Telugu

DGP Harish Kumar Gupta: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు.. డీజీపీ సీరియస్‌ వార్నింగ్‌

Dgp Harish Kumar Gupta

Dgp Harish Kumar Gupta

DGP Harish Kumar Gupta: ఏపీలో పోలింగ్‌ అనంతరం కొన్ని ప్రాంతాల్లో అల్లలర్లు చెలరేగాయి.. దీంతో, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కొందరు అధికారులపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది.. మరోవైపు.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ప్రత్యర్థులను బెదిరించే వ్యక్తులు కూడా లేకపోలేదు.. అయితే, సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Read Also: MLC Kavitha: కవిత జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్‌ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తన ప్రకటనలో వార్నింగ్‌ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని.. వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అట్టి పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరు గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని తన ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

Exit mobile version