NTV Telugu Site icon

Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను

Raja Singh

Raja Singh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుండి ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా.. బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందించారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్ లో తెలిపారు. గతంలో రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

Bomb Threat Case: బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి..

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ… బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని తెలిపారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారని.. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చానని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చూడాలన్నారు. ఈరోజు తనకు కంటిన్యూయస్ గా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడించారు. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చానన్నారు.