Site icon NTV Telugu

Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్‌.. రాజీనామా చేయాలని వార్నింగ్..!

Au

Au

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఉన్న వీవీజీ ప్రసాద్ రెడ్డి , రిజిస్ట్రార్‌గా ఉన్న జేమ్స్ స్టీఫెన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి.. తప్పుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారట ఆగంతకులు.. దీంతో.. విశాఖ ⁠మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏయూ అధికారులు.. ⁠హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాల్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.. ఇక, బెదిరింపుల నేపథ్యంలో.. యూనివర్సిటీకి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలని మూడో పట్టణ పోలీసులకు కోరారు ఏయూ అధికారులు. కాగా, ఏయూలో గోల్‌మాల్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి.. యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారని కొందరు ఆరోపించారు.. లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ.. స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం విదితమే.

Read Also: T20 WC 2024 Super 8: సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా

Exit mobile version