Home Minister Anitha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకరమైన భాషతో హెచ్చరిస్తూ మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే ఈ బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు మెసేజ్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలీసుల దృష్టికి పేషీ సిబ్బంది తీసుకెళ్లారు. ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్‌పై నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Read Also: Manchu Manoj: పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్.. మళ్ళీ తండ్రిపై ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంమంత్రి అనిత స్పందించారు. డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పేషీకి రెండు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు డీజీపీ హోంమంత్రి అనితకు వివరించారు. ఫోన్ కాల్ వచ్చిన నెంబర్‌ను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.