NTV Telugu Site icon

Viral Video: వెయ్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..

New Project (2)

New Project (2)

భారతదేశంలోని అనేక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో ఇటీవల చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించారు. అయితే ఈ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. 5జీ తో దూసుకుపోతున్న ఈ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే పురాతన కాలంలో ప్రజలు మల, మూత్ర విసర్జన కోసం ఎక్కడికి వెళ్లారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పూర్వకాలంలో మరుగుదొడ్లు ఉండేవి, కానీ అవి ఎలా ఉండేవి? అనే ప్రశ్నకు ఇన్ స్టాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సమాధానమిచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఒక పురాతన కోట యొక్క వీడియో వైరల్ అవుతోంది. వేయి సంవత్సరాల నాటి కోటగా వివరించారు. ఈ కోటలో ఒక టాయిలెట్ (పురాతన కాలంలో మరుగుదొడ్లు) చూడవచ్చు.

READ MORE: Renuka Swami Murder: అమ్మో ఇంత టార్చర్ చేశారా? పోస్ట్‌మార్టంలో దొరికిన దర్శన్ గ్యాంగ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వింత వీడియోలు తరచుగా పోస్ట్ చేయబడతాయి. ఇటీవల, కోటలో 1000 సంవత్సరాల పురాతన మరుగుదొడ్డి ఉన్న ఇలాంటి వీడియో షేర్ చేయబడింది. వీడియోలో మరుగుదొడ్డికి చేరుకోవడానికి పైకి మెట్లు ఉండటం చూడవచ్చు. సన్నని మార్గం గుండా పైకి వెళుతున్నప్పుడు, ఒక ఎత్తైన ప్లాట్‌ఫారమ్ లోపల కనిపిస్తుంది. అందులో ఓపెన్ షాఫ్ట్ ఉంది. ఇది దిగువ వరకు తెరిచి ఉంటుంది. ప్రజలు దానిపై కూర్చొని మలవిసర్జన చేసేవాళ్లు. ఇది చాలా చిన్న గది. కోటల్లో వినియోగించే టాయిలెట్లను బయట గోడకు దగ్గరగా నిర్మించారని దీంతో కోట నుంచి వ్యర్థాలు నేరుగా కిందికి వెళ్తాయని వీడియోలో తెలిపారు. చాలా సార్లు ఈ మురికి నేరుగా నీటి వనరులో పడేదని పేర్కొన్నాడు ఓ వ్యక్తి. ఈ టాయిలెట్‌ని చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనికి చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. వింత కామెంట్లు వస్తున్నాయి.