Site icon NTV Telugu

Smart TV: టీవీలపై ఆఫర్ల వర్షం.. రూ.4,499కే స్మార్ట్ టీవీ..

Tv

Tv

ఈ రోజుల్లో ఇంటి వినోదం కోసం స్మార్ట్ టీవీ లేకుండా ఊహించడం కష్టం. సాధారణ టీవీలు కేవలం ఛానెళ్లు చూపించడానికి పరిమితమైతే, స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి అనేక అదనపు సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తు్న్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. HD LED స్మార్ట్ టీవీ రూ. 5,000 కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో టీవీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది.

థామ్సన్ ఆల్ఫా HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో రూ.4,999 కు లభిస్తుంది. ఇది 24-అంగుళాల HD డిస్‌ప్లేను 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఈ టీవీలో 20W స్పీకర్లు ఉన్నాయి. ఇతర స్మార్ట్ టీవీల మాదిరిగానే, ఇది ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లతో ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్ చిన్న గదులు, కార్యాలయాలు లేదా వ్యక్తిగత క్యాబిన్‌లకు అనువైనది. దీనిని నెలవారీ వాయిదా రూ.159 తో కొనుగోలు చేయవచ్చు.

కోడాక్ QLED SE 32 అంగుళాల QLED HD రెడీ స్మార్ట్ Linux TV 2025 ఎడిషన్

ఈ స్మార్ట్ టీవీ 32-అంగుళాల QLED HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టీవీ 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0 కలిగి ఉంది. ఈ Google Android స్మార్ట్ టీవీలో 512 MB RAM, 4GB ROM ఉన్నాయి. JioHotstar, YouTube, Prime Video, Sony Liv, Zee5 యాప్‌లు టీవీలో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.8,499. ఈ స్మార్ట్ టీవీ నెలవారీ వాయిదా రూ.412.

ఏసర్ 32 అంగుళాల అల్ట్రా I సిరీస్ HD స్మార్ట్ LED గూగుల్ టీవీ

ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 32-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో HDMI, USB, Wi-Fi ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+తో సహా పలు రకాల యాప్‌లకు మద్దతు ఇస్తుంది. దీని ధర రూ.9,999, నెలవారీ వాయిదాలలో రూ.485తో అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Samsung 32 అంగుళాల HD రెడీ LED స్మార్ట్

ఈ Samsung స్మార్ట్ టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో HD డిస్‌ప్లే, HDR 10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 50Hz. ఈ టీవీ Netflix, JioHotstar, Prime Video, YouTube, Zee5, Apple TV+, Sony LIV వంటి యాప్‌లతో ప్రీ ఇన్‌స్టాల్ అయ్యాయి. అయితే, ఈ టీవీ ధర పైన పేర్కొన్న టీవీల కంటే ఎక్కువగా ఉంది. దీని ధర రూ.13,990. ఇది Flipkart నుంచి EMIలో కూడా లభిస్తుంది.

Exit mobile version