NTV Telugu Site icon

Farooq Abdullah: న్యాయం జరిగేవరకు జమ్మూలో హత్యలు ఆగవు.. ఫరూక్ సంచలన వ్యాఖ్యలు

Farooq Abdullah

Farooq Abdullah

Farooq Abdullah: కశ్మీర్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న హత్యలు న్యాయం జరిగే వరకు కొనసాగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు న్యాయం జరిగేవరకు ఈ దాడులు ఆగవన్నారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, లోయలో హత్యలు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు లోయలో హత్యలు జరుగుతూనే ఉంటాయని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

గతంలో ఆర్టికల్ 370 వల్ల దాడులు జరుగుతున్నాయని కొందరు చెప్పారని బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు అది రద్దు అయింది. అయినప్పటికీ ఇలాంటి హత్యలను ఎందుకు ఆపడం లేదు? బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి హత్యలకు ఆర్టికల్ 370 కారణమైతే, అమాయక కశ్మీరీ పండిట్ పురాన్ క్రిషన్ భట్ ఎందుకు హత్యకు గురయ్యారని ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ హత్యకు ఏదో కారణం ఉండి ఉంటుందని, బయటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఆర్టికల్ 370 ఈ హత్యలకు కారణం కాదని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికడితేనే ఇలాంటి హత్యలు ఆగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దానికి సైనికపరంగానే మార్గం వెతకాలన్నారు. కాగా, శనివారం జరిగిన ఉగ్రకాల్పుల్లో కశ్మీరి పండిట్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ స్పందిస్తూ దాడికి పాల్పడిన బాధ్యులను విడిచిపెట్టేది లేదని అన్నారు.

ఇలా చంపుకుంటూ పోతే జమ్మూకశ్మీర్‌ లోయ మాత్రమే ఉంటుందని ఇంకేమీ ఉండదని ఫరూక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాశ్మీరీ పండిట్లపై వ‌రుస దాడులు చోటు చేసుకోవ‌డంపై ఆయన స్పందించారు. కాగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌పై జ‌మ్మూలోని అబ్దుల్లా నివాసంలో అఖిలప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఇప్పటి వ‌ర‌కు ఇద్దరు కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మ‌రో వైపు కేంద్రం ఈ దాడులను సీరియ‌స్‌గా తీసుకుంది.

Congress Presidential Poll: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌.. గెలిచేది ఆయనేనట!

శనివారం నాడు, షోపియాన్‌లోని పండ్లతోటకు వెళుతుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కాశ్మీరీ పండిట్ పూరన్ క్రిషన్ భట్ మరణించాడు. భట్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు. కుట్ర చేసిన దోషుల అంతం మట్టికరిపిస్తామని జమ్మూకశ్మీర్‌ బీజేపీ చీఫ్‌ రవీందర్ రైనా అన్నారు. షోపియాన్ జిల్లాలో కాశ్మీరీ పండిట్‌ను హతమార్చడానికి కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.