Kulwinder Kaur : కంగనాను కొట్టిన కుల్విందర్ కౌర్‌కు గోల్డ్ రింగ్.. పంపనున్న టీపీడీకే
- కంగనాను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్
- రోజు రోజుకు ఆమెకు పెరుగుతున్న మద్దతు
- బంగారపు ఉంగరాన్ని పంపనున్న టీపీడీకే పార్టీ
- కౌర్ ను సన్మానించనున్న రైతు సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతోంది. కొందరు మాత్రం కుల్విందర్ కౌర్‌ను విమర్శిస్తున్నారు. అయితే కుల్విందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత ఆమెను విడుదల చేయాలని ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టిపిడికె) పార్టీ కుల్విందర్ కౌర్‌కు బంగారు ఉంగరాన్ని(గోల్డ్ రింగ్) పంపాలని నిర్ణయించింది. ఈ ఉంగరానికి పెరియార్ ఫోటో కూడా జతచేయనున్నారు.
Read Also:Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్పోర్టును జెట్ స్పీడ్లో పూర్తి చేస్తా..
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ఎనిమిది గ్రాముల బంగారు ఉంగరాన్ని పంపాలని యోచిస్తున్నామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి కేయూ రామకృష్ణన్ శనివారం తెలిపారు. రైతుల కోసం నిర్భయంగా నిలబడిన మహిళకు తగిన గౌరవం దక్కాలన్నారు. నిరసనలో కూర్చున్న రైతులపై కంగనా అవమానకరమైన పదాలను ఉపయోగించిందని.. చెంపదెబ్బ కొట్టిన తర్వాత కుల్విందర్ కౌర్ పేర్కొన్నారు. కుల్విందర్ తల్లి కూడా ఆ సమ్మెలో పాల్గొన్నారు. కుల్విందర్ కౌర్ ఇంటి చిరునామాకు ఉంగరాన్ని పంపుతామని రామకృష్ణన్ తెలిపారు. ఆమె కొరియర్‌ని అంగీకరించకపోతే, మేము మా సభ్యులలో ఒకరిని ఆమె ఇంటికి పంపుతామన్నారు. మా సభ్యులతో ఒకరు రైలులో లేదా విమానంలో తన ఇంటికి వెళతారు. పెరియార్ పుస్తకాలను కూడా ఆమెకు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఆదివారం మొహాలీలో సిఐఎస్‌ఎఫ్‌కి మద్దతుగా ర్యాలీ కూడా జరిగింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కౌర్‌పై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మొహాలీ పోలీసులు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. సిటీ ఎస్పీ హర్బీర్ సింగ్ అత్వాల్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేస్తుంది.
Read Also:Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ కోపంతో కంగనాను కొట్టి ఉండవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అన్నారు. చాలా మంది కుల్విందర్ కౌర్‌ను ధైర్యవంతురాలు, వీర వనిత అని పిలుస్తున్నారు. పంజాబ్‌లోని కొన్ని చోట్ల కుల్విందర్ కౌర్‌కు అనుకూలంగా లడ్డూలు, మిఠాయిలు కూడా పంపిణీ చేశారు. కుల్విందర్ కౌర్‌ను సన్మానించనున్నట్లు రైతు సంఘాలు కూడా ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 7న కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత భద్రతా తనిఖీల కోసం మోహరించిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఉన్నట్లుండి చెంపదెబ్బ కొట్టింది.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!