NTV Telugu Site icon

Kulwinder Kaur : కంగనాను కొట్టిన కుల్విందర్ కౌర్‌కు గోల్డ్ రింగ్.. పంపనున్న టీపీడీకే

New Project (47)

New Project (47)

Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతోంది. కొందరు మాత్రం కుల్విందర్ కౌర్‌ను విమర్శిస్తున్నారు. అయితే కుల్విందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత ఆమెను విడుదల చేయాలని ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టిపిడికె) పార్టీ కుల్విందర్ కౌర్‌కు బంగారు ఉంగరాన్ని(గోల్డ్ రింగ్) పంపాలని నిర్ణయించింది. ఈ ఉంగరానికి పెరియార్ ఫోటో కూడా జతచేయనున్నారు.

Read Also:Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్పోర్టును జెట్ స్పీడ్లో పూర్తి చేస్తా..

ఎనిమిది గ్రాముల బంగారు ఉంగరాన్ని పంపాలని యోచిస్తున్నామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి కేయూ రామకృష్ణన్ శనివారం తెలిపారు. రైతుల కోసం నిర్భయంగా నిలబడిన మహిళకు తగిన గౌరవం దక్కాలన్నారు. నిరసనలో కూర్చున్న రైతులపై కంగనా అవమానకరమైన పదాలను ఉపయోగించిందని.. చెంపదెబ్బ కొట్టిన తర్వాత కుల్విందర్ కౌర్ పేర్కొన్నారు. కుల్విందర్ తల్లి కూడా ఆ సమ్మెలో పాల్గొన్నారు. కుల్విందర్ కౌర్ ఇంటి చిరునామాకు ఉంగరాన్ని పంపుతామని రామకృష్ణన్ తెలిపారు. ఆమె కొరియర్‌ని అంగీకరించకపోతే, మేము మా సభ్యులలో ఒకరిని ఆమె ఇంటికి పంపుతామన్నారు. మా సభ్యులతో ఒకరు రైలులో లేదా విమానంలో తన ఇంటికి వెళతారు. పెరియార్ పుస్తకాలను కూడా ఆమెకు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఆదివారం మొహాలీలో సిఐఎస్‌ఎఫ్‌కి మద్దతుగా ర్యాలీ కూడా జరిగింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కౌర్‌పై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మొహాలీ పోలీసులు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. సిటీ ఎస్పీ హర్బీర్ సింగ్ అత్వాల్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేస్తుంది.

Read Also:Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!

సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ కోపంతో కంగనాను కొట్టి ఉండవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అన్నారు. చాలా మంది కుల్విందర్ కౌర్‌ను ధైర్యవంతురాలు, వీర వనిత అని పిలుస్తున్నారు. పంజాబ్‌లోని కొన్ని చోట్ల కుల్విందర్ కౌర్‌కు అనుకూలంగా లడ్డూలు, మిఠాయిలు కూడా పంపిణీ చేశారు. కుల్విందర్ కౌర్‌ను సన్మానించనున్నట్లు రైతు సంఘాలు కూడా ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 7న కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత భద్రతా తనిఖీల కోసం మోహరించిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఉన్నట్లుండి చెంపదెబ్బ కొట్టింది.