NTV Telugu Site icon

Chada Venkata Reddy: ఈనెల 26 నుండి ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Chada

Chada

మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించి, అక్కడి ముఖ్యమంత్రిని రాజీనామా చేయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడరు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Suriya: సూర్య పుట్టినరోజున విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు అభిమానులు మృతి

అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్టీసీని పరిరక్షించుకోవాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చాడ వెంకటరెడ్డి తెలిపారు. యూనియన్లు లేకపోవడంతో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయన్నారు. ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Daggubati Purandeswari: రాయలసీమ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం

మరోవైపు ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలపై మిత్ర పక్షాల కూటమితో సీట్ల సర్దుబాటు పై చర్చ జరిగిందని తెలిపారు. బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో వామపక్షాల పోరాటం కొనసాగుతుందన్నారు. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తు పై చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు వివిధ సమస్యలపై ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.