టాలీవుడ్ లో మరో స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్నాడు. ఆర్ ఎక్స్ 100ఎం మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : Ghattamaneni : నిర్మాత అశ్వనీదత్ కు ఘట్టమనేని ఫ్యామిలీ కృతజ్ఞత లేఖ.
తాజాగా ఈ విషయాన్నీ అధికారకంగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. తిరుపతి నేపధ్యంలో జరిగే ప్రేమ కథగా ఈ సినిమా రాబోతుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అఫీషయల్ ప్రకటన రాబోతుంది. ఈ సినిమా కోసం జయకృష అటు యాక్టింగ్, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిటిలోను దర్శకుడు అజయ్ భూపతి దగ్గరుండి మరి శిక్షణ ఇస్తున్నాడు. జయకృష్ణ తొలి సినిమా పర్ఫెక్ట్ గా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అజయ్ భూపతి. జయకృష్ణ సరసన హీరోయిన్ గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రష తడానీ పేరుని పరిశీలిస్తున్నారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మహేశ్ బావ సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా, మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మహేశ్ అన్న కొడుకు ఎంట్రీ ఇస్తున్నాడు.
