Elections 2024 : దేశంలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు బారులు తీరారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Read Also:Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి..?
8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద 19 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు, మానిటరింగ్ బృందాలను నియమించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఓ ఘటన ఆసక్తికరంగా మారింది.
Read Also:Voters Protest: తాడేపల్లిగూడెంలో డబ్బులు ఇవ్వడం లేదని ఓటర్ల ఆందోళన..
ఓటు వేయడానికి గిరిజనులు ముందుకు వచ్చిన విధానం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. రోడ్లు, వాహనాలున్నా చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలాంటి వారికి చాటి చెప్పింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.