Site icon NTV Telugu

Telangana Elections 2023: అగ్రనేతల ఇలాఖాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..!

Telangana Poll

Telangana Poll

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇదిలా ఉంటే.. ఓటు వేసేందుకు క్యూలైన్ లో వేచి ఉన్న వారికి అవకాశం కల్పించారు అధికారులు. కాగా.. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అగ్రనేతల ఇలాఖాల్లో పోలింగ్ శాతం ఎంత నమోదైందో ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ విడుదల..

కేసీఆర్, రేవంత్ బరిలో ఉన్న కామారెడ్డిలో 34.6 శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 42.54 శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్ లో 41.40 శాతం ఓటింగ్.. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్ లో 43.20 శాతం ఓటింగ్ నమోదైంది. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 40.67 శాతం ఓటింగ్.. బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్ లో 38.90 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తమ్ బరిలో ఉన్న హుజూర్ నగర్ 48.61 శాతం పోలింగ్ నమోదైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో 41.06 శాతం ఓటింగ్ నమోదైంది.

Exit Polls: రాజస్థాన్‌లో నెక్ టూ నెక్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో హస్తం జోరు..

Exit mobile version