Hero Dhanush Tweet on RaayanSuccess: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మించారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వసూళ్ల వర్షం కురుస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రాయన్ నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.
Also Read: The GOAT: నెగెటివ్ ప్రచారం చేయొద్దు.. విజయ్ ‘ది గోట్’ రూమర్స్‌పై స్పందించిన నిర్మాత!
రాయన్ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే రాయన్ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి ధనుష్ ఎక్స్‌లో ధన్యవాదాలు చెప్పారు. ‘ఘన విజయం అందించిన సినీ ప్రేక్షకులు, ఆత్మీయులు, పత్రికా, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై అమితమైన ప్రేమ చూపించి.. అండగా నిలబడుతున్న అభిమానులకు ప్రత్యేకంగా థ్యాంక్యూ. ఇప్పటివరకూ నేను అందుకున్న ది బెస్ట్ బ్లాక్‌బస్టర్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. రాయన్ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
🙏🙏♥️♥️ pic.twitter.com/YSiYLIGJLx
— Dhanush (@dhanushkraja) July 29, 2024
