The GOAT: నెగెటివ్ ప్రచారం చేయొద్దు.. విజయ్ ‘ది గోట్’ రూమర్స్‌పై స్పందించిన నిర్మాత!
- విజయ్ ప్రధాన పాత్రలో ది గోట్
- సినిమా విడుదలపై పలు రూమర్స్
- స్పందించిన నిర్మాత అర్చన కల్పాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Archana Kalpathi about Vijay’s The GOAT Release Date: తమిళ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ది గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలపై పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ది గోట్ వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై చిత్ర నిర్మాతలలో ఒకరైన అర్చన కల్పాతి తాజాగా స్పందించారు. నెగెటివ్ ప్రచారం చేయొద్దని, సెప్టెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో స్పందించారు. ‘పనులు సమయానికి అనుకున్న పూర్తవుతున్నాయి. మా టీమ్ 24 గంటలు పని చేస్తోంది. చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుంది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నిజం కాదు. దయచేసి నెగెటివ్ ప్రచారం చేయొద్దు. ఆగస్టు 1న అప్‌డేట్ వస్తుంది’ అని అర్చన కల్పాతి పేర్కొన్నారు.
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
Also Read: Karthi In Kanguva: ‘కంగువా’లో కార్తీ.. విషయం చెప్పేసిన లిరిక్ రైటర్!
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ది గోట్‌ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడారు. ఈ సినిమాలో విజయ్ పాతికేళ్ల కుర్రాడిగా కనిపించనున్నారు. ఇందులో జయరామ్, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్‌లతో భారీ తారాగణం ఉంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వస్తోంది.
Not true. We are very much on track and working 24/7 to make a kickass film. Please don’t spread negativity and false news.
— Archana Kalpathi (@archanakalpathi) July 29, 2024
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?