Site icon NTV Telugu

Lebanon: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లలో ఈ బ్యూటీ హస్తం..! ఈమె ఎవరో తెలుసా..?

Lebanon

Lebanon

లెబనాన్‌లో పేజర్ పేలుడు ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తిగా 49 ఏళ్ల విదేశీ మహిళ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మహిళ హంగేరీకి చెందినది. ఆమె పేరు క్రిస్టియానా బార్సోనీ. క్రిస్టియానా బుడాపెస్ట్‌లోని BAC కన్సల్టింగ్‌కు CEOగా వ్యవహరిస్తోంది. అయితే.. ఈమె పని చేసే కంపెనీకి తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థతో లింకులు ఉన్నట్లు సమాచారం. లెబనాన్‌లో బాంబు పేలుళ్లలో ఉపయోగించిన పేజర్లలో ఈ కంపెనీ పేరు ఉంది.

Read Also: Shubman Gill Century: గిల్ సెంచరీ.. దిగ్గజాల సరసన చేరిన యువ ఆటగాడు

ఈ విషయంలో.. గత కొద్ది రోజులుగా క్రిస్టియానాకు అజ్ఞాత బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని క్రిస్టియానా తల్లి మీడియాకు తెలిపింది. పేజర్ పేలుడు ఘటనతో తన కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని తల్లి వెల్లడించింది. ఈ పేజర్లు బుడాపెస్ట్ గుండా వెళ్లవని.. హంగేరీలో తయారు చేసినవి కావని చెప్పింది. హంగేరియన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని తెలిపింది.

Read Also: Strange Tradition: ఈ ఊళ్లో ఆడవాళ్ళు 5 రోజులు బట్టలు వేసుకోరు.. ఎక్కడో కాదు మన దేశంలోనే

క్రిస్టియానా సిసిలీలో జన్మించింది. కాటానియాలో పెరిగింది. ఈమె తండ్రి అక్కడ పనిచేస్తుండే వారు.. తల్లి గృహిణి. క్రిస్టియానా చదువుల్లో బాగా రాణించింది. 2000వ సంవత్సరంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి పార్టికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ(PhD) పూర్తి చేసింది. క్రిస్టియానా బార్సోనీ వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమెకు బుడాపెస్ట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. అందులో ఆమె పాస్టెల్ డ్రాయింగ్‌లు ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా భవనంలో నివసించే పొరుగువారు కూడా ఆమె ప్రవర్తన గురించి చెడుగా చెప్పలేదు. అయితే.. పేజర్ దాడి జరిగినప్పటి నుండి క్రిస్టియానా బార్సోనీ కనిపించలేదు.

Exit mobile version