Site icon NTV Telugu

Thriumavalan: బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి

Thirumavalan

Thirumavalan

బీపీ మండల్‌‌ దేశంలో అన్ని వర్గాలపై వత్తిడి తెచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారన్నారు వీసీకే పార్టీ అధ్యక్షులు తిరుమావళన్. మండల్ కమీషన్ సిఫారసులు అమలు పరచడం వల్ల వీపీ సింగ్ అధికారం కోల్పోయారు..సామాజిక న్యాయం కోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ ల ఐఖ్యత దేశానికి అవసరం. దేశం లో 2024లో బ్రాహ్మణ భావజాలం ఉన్న పార్టీ లు అధికారంలోకి వస్తే ఇక రిజర్వేషన్లు ఉండవు..దేశంలో అన్ని జిల్లాలో మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి..హైదరాబాదులో కూడా మండల్ విగ్రహం ఏర్పటు చేయాలని కేసీఆర్ ను కోరానన్నారు.

మన హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి..బీసీల కు హక్కులు కల్పించలేక పోయనన్న బాధతో బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేశారు..అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి..బీసీల ఆత్మగౌరవం కోసం దేశ వ్యాప్తంగా బీసీలు పోరాటం చేయాలి..బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు బీసీల మలివిడత ఉద్యమం గా భావించాలి..గుంటూరు లో జరుగుతున్న ఆత్మ గౌరవ సభ వేదికగా ఈ పోరాటం ప్రారంభం అవ్వాలన్నారు.

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర సభలో మాట్లాడారు. కొందరికి మాత్రమే పదవులు ఇచ్చారు.. అందరి హక్కులను అణగ‌దొక్కుతున్నారు. స్థానిక సంస్థలలో 34 శాతం ఉన్న రిజర్వేషన్ ను24 శాతం తగ్గించారు. 16 వేల మందికి పదవులు ఇవ్వకుండా కూర్చోబెట్టారు. బలహీన వర్గాల‌ ఆత్మగౌరవ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించిన బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. బీసీలపై దాడులు చేసే ఏ శక్తి నైనా ఎదిరిస్తా అన్నారు కొల్లు రవీంద్ర.

Read Also; Raashi Khanna: హమ్మయ్య.. అమ్మడి లిప్ కిస్ ఇప్పటికి వర్క్ అవుట్ అయ్యింది

Exit mobile version