Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత ఎస్సీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్
  • తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు
  • ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు
Kamareddy

Kamareddy

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత ఎస్సీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగతనానికి వచ్చి ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన వింతైన దొంగతనం వెలుగుచూసింది. తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు.. నగలు తీసేందుకు సమయం లేక బీరువానే ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. బీరువాలో రెండు తులాల బంగారం, నగదు దోపిడీ చేశారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా దొంగలు బీరువాను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించినట్లు తెలిపారు. ఇది తెలిసిన వారు వామ్మో దొంగలు ఎంతకు తెగించార్రా అంటూ చర్చించుకుంటున్నారు.
YouTube video player