సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి భారీగా తరలి తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. అయితే, సొంతూర్లకు వెళ్లే పనిలో ప్రయాణికులు ఉంటే.. దొంగలు మాత్రం తమ చేతివాటానికి పని చెప్తున్నారు. జూబ్లీ బస్టాండ్ పరిధిలో ఈ మూడు రోజుల్లో అనేక సెల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి. రెండు మూడు రోజుల్లో పలు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో జేబీఎస్ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు పనిచెయ్యడం లేదు.. అనేక ఫిర్యాదులు అందినా కూడా ఆర్టీసీ అధికారులు, పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇక, పోలీస్ ఔట్ పోస్ట్ ఉన్నప్పటికీ బస్టాండ్ లో మొత్తం సీసీ కెమెరాలల్లో కేవలం 3 కెమెరాలు పని చేస్తున్నాయని పోలీసులు అంటున్నారు. పోలీస్ ఔట్ పోస్ట్ రూంలో ఖాళీగా సీసీ కెమెరాల స్క్రీన్స్ కనిపిస్తుంది. ఆర్టీసీ ఔట్ పోస్ట్ రూంలో మూడు రోజుల క్రితం సీసీ వీడియోతో ఒకే ఒక్క స్క్రీన్ కనబడుతుంది. దీంతో దొంగలకు దొంగతనాలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Read Also: Guntur Kaaram: డే 2 కలెక్షన్స్… రెండు రోజుల్లో 50% బ్రేక్ ఈవెన్ టార్గెట్ రికవరీ
ఇప్పటికైనా ఆర్టీసీ, పోలీసులు సిబ్బంది స్పందించి కొట్టేసిన సెల్ ఫోన్స్, పర్సులను తమకు రికవరీ చేసి ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే, పండగ కోసం ఊరికి వెళ్లిన ఇళ్లే కొందరు దొంగలు టార్గెట్ చేస్తున్నారు అనే సమాచారంతో ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు.
