Site icon NTV Telugu

Stealing Purse: అయ్యో పాపం… పర్స్ కొట్టేయడానికి ట్రై చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి..!

Thief

Thief

64 కళల్లో దొంగతనం కూడా ఒక కళే. కొందరు ఎంతమందిలో ఉన్నా భలే చాకచక్యంగా దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం వెంటనే దొరికిపోయి చావు దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాపం దొంగ దొరికిపోవడం చావు దెబ్బలు తినడం చూడవచ్చు. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు దొంగపై జాలి చూపిస్తుంటే మరికొందరు తగిన శాస్తి జరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియో ప్రకారం కొంతమంది బస్సు డోర్ వద్ద లైన్ లో నిలబడి బస్ టికెట్ తీసుకొని లోపలికి వెళుతూ ఉంటారు. వారితో పాటే క్యూలో నిల్చున్న వ్యక్తి బస్సు మొదటి సీటులో కూర్చున్న మహిళ పర్స్ దొంగిలించడానికి ట్రై చేస్తాడు. మొదట ఆ పర్స్ చేతికి రాదు. అప్పుడు ఆ దొంగ నవ్వుతూ ఆ మహిళ పర్స్ మరోసారి గట్టిగా లాగటానికి ప్రయత్నించి వీలుకాక పారిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగానే అతని తరువాత ఉన్న వ్యక్తి బస్సు డోర్ దగ్గర నుంచి దిగి డోర్ వెంటనే వేసేస్తాడు.

Also Read: Cat attacks Owner: పిల్లి పులి అవ్వడం అంటే ఇదేనేమో… యజమానికి చుక్కలే!

అయితే పాపం ఆ దొంగ చేయి దానిలో ఇరుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. ఇంతలో బస్సు డ్రైవర్ బస్సును పోనివ్వడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ఒక పెద్ద కర్ర తీసుకొని దొంగను కొడుతూ ఉంటాడు. పాపం దొంగ చేయి ఇరుక్కుపోవడంతో ఎక్కడికి తప్పించుకోలేక చావు దెబ్బలు తినడం మనం వీడియోలో చూడవచ్చు. మరీ ఇలా దొరికిపోయేటట్లు ఎలా దొంగతనం చేస్తారో అని ఈ వీడియో చూసిన వారు అనుకుంటున్నారు.

Exit mobile version