NTV Telugu Site icon

Variety Ganesha: మోడీతో కలిసి చాయ్ తాగుతున్న వినాయకుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Modi

Modi

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సారి కొన్ని వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశాఖనగరంలో భారీగా గణనాథులు కొలువుదీరాడు. గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తు బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 20 టన్నుల బెల్లంతో గణపతిని తయారుచేశారు. పూజలా అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు.

READ MORE: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్స్.. భారత జట్టులోకి వస్తామని ఆశాభావం

కాగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వినాయకుడి విగ్రహం జనాలను అబ్బురపరుస్తోంది. ఈ విగ్రహం పక్కన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూర్చున్న విగ్రహాన్ని కూడా పెట్టారు. వినాయకుడు, నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి ఛాయ్ తాగుతున్నట్లు విగ్రహాలు రూపొందించారు. కాగా.. ఈ విగ్రహాలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందూ జనజాగృతి సమితి ఈ విగ్రహంపై స్పందించింది. “హిందువులారా.. ఇలాంటి గణేష్ విగ్రహాలను అపహాస్యం చేయడం మానుకోండి!” అని పిలుపునిచ్చింది. ” ఒక చోట శ్రీ గణేశుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో అఫ్జల్ఖాన్ కడుపు నుంచి ప్రేగులను బయటకు తీస్తున్నాడు. మరో చోట శ్రీ గణేష్ శ్రీ నరేంద్ర మోడీతో కలిసి ఒక కప్పు టీ తాగుతున్నట్లు చూపబడింది. శ్రీ గణేశుడిని ఈ విధంగా తయారు చేయడం పాపం.. దయ చేసి ఇలాంటివి మానుకోండి.” అని హిందూ జనజాగృతి సమితి పేర్కొంది. ఈ సమాచారం 2014లో జనజాగృతి సమితి తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ విగ్రహం ఎప్పుడు, ఎక్కడికి ప్రతిష్ఠించారనే సమాచారం లేదు. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.