భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2002, 2013లో టీమిండియా రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన రెండవ ఎడిషన్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది.
Also Read:Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని ఉరితీస్తాం.. ఎంపీ సీఎం వార్నింగ్..
ఈ మ్యాచ్ లో కివీస్ జట్టును తేలిగ్గా తీసుకుంటే ముప్పు తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ సేనను ఓడించే కెపాసిటీ కివీస్ కు ఉందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కివీస్ జట్టులో ఈ ఐదుగురు డేంజరస్ ప్లేయర్స్ అని వీళ్లతోనే టీమిండియాకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఈ ప్లేయర్స్ ను త్వరగా పెవిలియన్ కు చేరిస్తే భారత్ కు విజయం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే?
రచిన్ రవీంద్ర
లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్ర ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. దుబాయ్ పిచ్ పై రచిన్ రవీంద్ర ఆల్ రౌండ్ ప్రదర్శన భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ చేశాడు. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ బాది జట్టు విజయంలో కీలక రోల్ ప్లేచేశాడు.
Also Read:Raghunandan Rao: అక్కడ చర్చ చేద్దాం రండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్‌రావు సవాల్
కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ కూడా భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా ఉన్న ఆటగాళ్ళలో ఒకడు. వికెట్ పై నిలకడగా నిలబడే అతని కెపాసిటి, జట్టుకు భారీ స్కోర్ అందించడంలో విలియమ్సన్ కృషి టీమిండియాకు ముప్పు పొంచి ఉంటుంది. సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 102 పరుగులు చేశాడు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అతనికి భారత బౌలర్ల బౌలింగ్ పై అవగాహన కలిగి ఉన్నాడు.
Also Read:Raghunandan Rao: అక్కడ చర్చ చేద్దాం రండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్‌రావు సవాల్
గ్లెన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ రూపంలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఉన్నాడు. మ్యాచ్ చివర్లో పరుగుల వరద పారించగలడు. అతను అద్భుతమైన ఫీల్డర్. చివరిసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు, ఫిలిప్స్ కోహ్లీ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. పేలుడు బ్యాటింగ్‌తో పాటు, ఫిలిప్స్ స్పిన్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టవచ్చు.
మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విషయంలో కూడా భారత్ జాగ్రత్తగా ఉండాలి. దుబాయ్‌లోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ మాయాజాలం భారతదేశానికి తలనొప్పిగా మారవచ్చు.
డారిల్ మిచెల్
డారిల్ మిచెల్ టీమిండియాను ఇబ్బంది పెట్టే మరో కివీస్ ప్లేయర్. 2025 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో మిచెల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతనికి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం ఉంది. అతని బౌలింగ్ కూడా టీమిండియాకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది.