NTV Telugu Site icon

Lok Sabha Elections2024: దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ.. టాప్ 5 ఎంపీ అభ్యర్థులు వీరే

New Project (30)

New Project (30)

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల ఓట్ల ఆధిక్యంతో అస్సాంలోని ధుబ్రి నుంచి గెలుపొందారు. ఆయన రెండో అతిపెద్ద విజయం సాధించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిషా నుంచి 8.21 లక్షల ఓట్లతో గెలుపొందారు. ఇది మూడవ అతిపెద్ద ఆధిక్యం. దీని తర్వాత.. గుజరాత్‌లోని నవ్‌సారి నుంచి 7.73 లక్షల ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ విజయం సాధించారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా 7.44 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

READ MORE: Chandrababu Pawan Kalyan: నేడు ఢిల్లీకి చంద్రబాబు పవన్ అందుకోసమేన

అక్టోబరు 2014లో మహారాష్ట్రలోని బీడ్ నుంచి 6.96 లక్షల ఓట్లతో గెలుపొందిన బీజేపీకి చెందిన ప్రీతమ్ ముండే అత్యధిక ఆధిక్యంతో గతంలో రికార్డు సృష్టించారు. నవ్‌సారి నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పాటిల్ 2019లో 6.89 లక్షల ఓట్లతో గెలుపొంది రెండవ అతిపెద్ద ఆధిక్యతతో రికార్డు సృష్టించారు. ఈ సారి రికార్డు 7.73 లక్షల ఓట్ల ఆధిక్యతతో తన రికార్డును తానే బద్దలు కొట్టారు.

READ MORE:ALLAHABAD: 40 ఏళ్ల తర్వాత అలహాబాద్‌లో కాంగ్రెస్‌ విజయం..

కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా మోడీ సమం చేశారు. ఇప్పటి వరకు వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.