NTV Telugu Site icon

World Cup Final 2023: టీమిండియా బలాబలాలు ఇవే.. ఆసీస్తో ముప్పు అదే..!

Team India

Team India

అహ్మదాబాద్లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అన్నీ మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోష్ లో ఉంది. అయితే వరల్డ్ కప్‌ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ సాధించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. మరో ట్రోఫీ కోసం ఆరాటపడుతుంది. ఏదేమైనప్పటికీ ఫైనల్‌లో రసవత్తర పోరు జరగనుంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. రేపటి మ్యాచ్ లో భారత్‌కు ఉన్న బలాలు, బలహీనతలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Read Also: Pet Dog Bite: అస్ట్రియా ప్రధానిని కరిచిన యూరప్‌ అధ్యక్షురాలి పెంపుడు శునకం

బలాలు..
జట్టు సారథి రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ 550 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రధాన బలం. మ్యాచుల్లో సందర్భానికి తగ్గట్టు బౌలర్లను రొటేట్ చేస్తాడు. అంతేకాకుండా ఫీల్డింగ్ ను కూడా సరైన పద్ధతిలో ఉంచి జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. మరోవైపు టాప్ ఆర్డర్లు కూడా మంచిగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ కూడా పలు సందర్భాల్లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్ విభాగంలో.. మహమ్మద్ షమీ బలంగా ఉన్నాడు. అతనికి తోడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముహ్మద్ సిరాజ్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశారు.

బలహీనతలు..
రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆచితూచి ఆడాలి. ఫైనల్ అనే ఒత్తిడి ఆటగాళ్లపైన ఉంటుంది.. అందుకోసం ఒత్తిడిని తట్టుకొని ఆడటం మంచిది. ఇదిలా ఉంటే.. టోర్నీ రెండో మ్యాచ్ లో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా ఆడాలి. బౌలింగ్ విభాగంగలో ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. మరోవైపు.. భారత్ బౌలర్లలో ఐదుగురు మాత్రమే ప్రధాన బౌలర్లు ఉన్నారు. పార్ట్‌టైం బౌలర్లను ఉపయోగించుకునే పరిస్థితి టీమిండియాకు లేదు. అందుకోసమని ఆస్ట్రేలియా బ్యాటర్లు టీమిండియా బౌలర్లను ఇబ్బందులు పెట్టే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ఈసారి టైటిల్ ఇండియా గెలుచుకునే అవకాశాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే స్వదేశంలో ఆడుతున్నారు కనుక.. టీమిండియా ఆటగాళ్లకు పిచ్ లు, వాతావరణం తెలిసి ఉంటుంది. అంతేకాకుండా.. భారత్ ఆటగాళ్లు ఈ టోర్నీలో మంచి ఫాంలో ఉన్నారు. ఇక స్టేడియంలో అభిమానుల మద్ధతు ఎక్కువగా టీమిండియాకు ఉంటుంది. అందుకోసమని ఇవన్నీ కలిసొచ్చే అంశాలే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ.. భారత్ తరపున ప్రతీకారం తీర్చుకునేందుకు మరో అవకాశం ముందుకొచ్చింది.

ఆసీస్తో ముప్పు
ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పుంజుకుని ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇక.. ఆఫ్ఘనిస్తాన్ తో చెన్నైలో ఆడిన మ్యాచ్‌లో ఆసీస్ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ మ్యాచ్ లో గ్లేన్ మ్యాక్స్ వెల్ వీరోచిత పోరాటం చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాను కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం మట్టికరిపించింది. దీంతో ఆస్ట్రేలియా మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. టీమిండియా బ్యాటర్లలో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్‌ను ప్రారంభంనుంచే సమర్థవంతంగా అడ్డుకోవచ్చనే భయాలు ఉన్నాయి. అందుకే.. భారత్ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి.