NTV Telugu Site icon

Haryana Elections Results: హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఇవే..!

Haryana Cong

Haryana Cong

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్ రోజు భిన్నమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అధికారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ అది జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందో అని ఎన్నికల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఓటమికి ఈ అంశాలు ప్రముఖంగా నిలిచాయి.

Odela 2: ఫైనల్ షెడ్యూల్ షూటింగ్లో తమన్నా ఓదెల 2

ప్రచారంలో వెనుకబడ్డారు:
హర్యానాలో ప్రచారంలో కాంగ్రెస్ గణనీయంగా వెనుకబడిపోయింది. ఎన్నికల ప్రకటనకు ముందే బీజేపీ ఎన్నికల మూడ్‌లో ఉండగా, కాంగ్రెస్ నేతలు జాబితాల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా కాస్త ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది.

ఫ్యాక్షనిజం ప్రబలింది:
కాంగ్రెస్‌లో ఫ్యాక్షనిజం ఆధిపత్యం కొనసాగింది. మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా, ఎంపీ కుమారి సెల్జా మధ్య వార్ నడుస్తుంది. సీఎం పదవికి తానే బలమైన పోటీదారు అని సెల్జా ప్రకటించారు. కాగా.. ఎన్నికల సమయంలో కుమారి సెల్జాపై భూపేంద్ర హుడా అనుచరుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో.. సెల్జా ప్రచారానికి దూరంగా ఉంది. ఓ సభలో రాహుల్ గాంధీ ఆమెను వేదికపైకి తీసుకొచ్చి హుడాతో కరచాలనం చేయించారు. ఇప్పటికీ వారి మధ్య గ్యాప్ ఉంది.

అసంబద్ధ ప్రకటన:
కాంగ్రెస్ గెలిస్తే ముందుగా తన ఇంటిని నింపుకుంటానని అసాంధ్ కాంగ్రెస్ అభ్యర్థి షంషేర్ గోగి ఓ సభలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో.. బిజెపి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసింది.. కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుందని బీజేపీ దుయ్యబట్టింది. అయితే.. కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది కానీ అప్పటికి నష్టం జరిగిపోయింది.

సమస్యలు పట్టించుకోలేదు:

రైతులు, మల్లయోధులు, సైనికుల సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. అంతే కాకుండా.. కాంగ్రెస్‌పై భారీ ఖర్చుల అంశాన్ని బిజెపి లేవనెత్తింది. దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థులు కోటా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సందేశాన్ని పంపింది.. బిజెపి ఈ సమస్యను క్యాష్ చేసుకుంది. మెరిట్ మిషన్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించలేకపోయింది. రెండవది.. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల తరహాలో రాజ్యాంగం అంశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు, అయితే ఈ ఫార్ములా ఈసారి ప్రజలలో పనిచేయలేదు.

భూపేంద్ర హుడా పవర్ సెంటర్‌గా మారారు:
మాజీ సీఎం భూపేంద్ర సింగ్‌కు టికెట్ల పంపిణీ నుంచి అన్ని విషయాల్లో హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఫార్ములా కూడా బెడిసికొట్టింది. ఎంపీలు కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. సెల్జా కొన్ని స్థానాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఇప్పటికే గ్రూపులుగా చీలిపోయిన కాంగ్రెస్ దీని వల్ల నష్టపోయింది.

Show comments