Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story These Are The Main Reasons Why Team India Lost In The Final

Team India: ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!

Published Date :November 19, 2023 , 10:27 pm
By Rajesh Veeramalla
Team India: ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా విజయంలో వీరుడిగా నిలిచాడు. ఒకానొక సమయంలో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాటర్లు 48 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే టీమిండియాపై ఎదురుదాడికి దిగి విశ్వవిజేతగా నిలిచారు. అయితే, టీమిండియా ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.

World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

పేలవమైన ఫీల్డింగ్
టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాంటి పరిస్థితిల్లో.. భారత ఫీల్డర్ల నుండి మంచి ఫీల్డింగ్ ఆశిస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు నిరాశపరిచారు. భారత ఫీల్డర్లు రనౌట్ అయ్యే అనేక అవకాశాలను కోల్పోయారు.

షమీ, బుమ్రా, జడేజా బౌలింగ్
ఈ ప్రపంచకప్‌ టోర్నీలో భారత బౌలర్లు మంచి ప్రదర్శన చూపించారు. కానీ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల ముందు బొక్కాబోర్లా పడ్డారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ రాణించలేకపోయారు. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పేలవంగా కనిపించారు.

చెత్త షాట్లు ఆడి నిరాశపరిచారు
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియన్ బౌలర్లు విజృంభణతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చెత్త షాట్లు ఆడి వికెట్లను పోగొట్టుకున్నారు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే యాభై పరుగుల మార్కును టచ్ చేయగలిగారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ షో చూపించారు.

భారత బౌలర్లు ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చారు
భారత బౌలర్లు చాలా అదనపు పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా ప్రారంభంలో.. మహ్మద్ షమీ తన లైన్ అండ్ లెంగ్త్ నుండి తప్పుకున్నట్లు కనిపించాడు. ఇతర బౌలర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీమిండియా బౌలర్లు పేలవమైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు సులభంగా పరుగులు చేశారు. వికెట్ కీపర్‌ కేఎల్ రాహుల్ కూడా చాలా మిస్ ఫీల్డ్‌లు చేశాడు. భారత బౌలర్లు 18 ఎక్స్ ట్రాలు ఇచ్చారు. ఇందులో 7 బైలు, 11 వైడ్‌లు ఉన్నాయి.

ట్రావిస్ హెడ్ తారుమారు చేశాడు
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 7 ఓవర్లలోపే ముగ్గురు బ్యాట్స్‌మెన్లు 48 పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత అభిమానుల ఆశలు చిగురించాయి.. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆచితూచి నిలకడగా ఆడి ట్రావిస్ హెడ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 120 బంతుల్లో 137 పరుగులు చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ పెవిలియన్‌కు వెళ్లాడు. అయితే అప్పటికి ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • final
  • Lost
  • reasons
  • Team India
  • telugu news

తాజావార్తలు

  • RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

  • Avesh Khan అత్యుత్సాహం.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే.?

  • Riniki Bhuyan Sarma: అస్సాం ముఖ్యమంత్రి భార్య ఎవరో తెలుసా?

  • US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions