Site icon NTV Telugu

Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రిసెప్షన్ కి హాజరైన ప్రముఖులు వీరే…

Anant Ambani Radhika

Anant Ambani Radhika

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక ముగిసింది. ఈరోజు (ఆదివారం) వివాహ రిసెప్షన్ జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కి “మంగళ్ ఉత్సవ్” అని పేరు పెట్టారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ ఫంక్షన్ జరుగుతోంది. ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎవరెవరకు హాజరయ్యారో ఇప్పుడు చూదాం..

READ MORE: Health benefits of clapping: రోజూ చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తమన్నా భాటియా, టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ వేర్వేరుగా వచ్చారు. నటి తమన్నా భాటియా కొత్త లుక్ తో ఆకట్టుకున్నారు. బిపాసా బసు తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి హాజరయ్యారు. ప్రముఖ సినీ నిర్మాత సుభాష్ ఘాయ్ కూడా తన భార్యతో కలిసి వచ్చారు. క్రికెటర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలిసి తన ఉనికిని నమోదు చేసుకున్నారు. నటుడు గోవింద కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు. నటుడు బొమన్ ఇరానీ తన భార్యతో కలిసి పాల్గొన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్ కూడా ఈ ఫంక్షన్‌లో భాగమయ్యారు. క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ చేరారు. కొడుకు టైగర్‌తో జాకీ ష్రాఫ్ కనిపించారు. బెంగాలీ నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ కూడా పాల్గొన్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ వచ్చారు. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా హాజరయ్యారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయ ధర్మకర్తలు వేడుకవద్దకు చేరుకున్నారు. ఇంకా పలువురు ప్రముఖులు నూతన వధువరులను ఆశీర్వదించేందుకు వచ్చారు.

Exit mobile version