NTV Telugu Site icon

Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..

New Project (2)

New Project (2)

ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం కారు కొనాలని ఆశ పడతారు. కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేరు. గతంలో రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్లు ఎన్నో ఉండేవి. కానీ వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇటీవల కార్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న కార్లను ఇప్పుడు చూద్దాం.

READ MORE: WhatsApp: వాట్సాప్‌లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!

మారుతి సుజుకి ఆల్టో K10 : మారుతి సుజుకి ఆల్టో దేశంలో అత్యంత నమ్మదగిన బ్రాండ్‌గా పేరొందింది. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు కూడా ఇదే. అయితే, ఆల్టో 800 కార్ల తయారీ గతేడాది నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) మోడల్స్ మాత్రమే ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీని ధర రూ.3.99 లక్షలు(ఎక్స్ షోరూం). దీంట్లో 1.0 లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 67ps పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ మ్యాన్యువల్ ఆప్షన్‌తో పనిచేస్తుంది.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో : మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ఎక్స్ షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 1.0 లీటర్ KB10C పెట్రోల్ ఇంజిన్‌‌తో వస్తుంది. ఈ మోటార్ గరిష్ఠంగా 67ps పవర్, 89Nm టార్క్‌ ఉత్పత్తి చేయగలదు. మంచి డిజైన్‌తో పాటు స్పేషియస్‌‌గా ఉండే వెహికల్ ఇది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ దీని సొంతం. ఆడియో, వీడియో, ఫోన్ కంట్రోల్స్‌ను స్టీరింగ్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రూ.5 లక్షల లోపు వస్తున్న బెస్ట్ వేరియంట్ ఇది.

READ MORE: Sivaji: ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసిన శివాజీ

రెనాల్ట్ క్విడ్ : రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) 0.8, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. కానీ గతేడాది 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. ప్రస్తుతం 1.0 లీటర్ పెట్రోల్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. క్విడ్ కారు ఎక్స్‌ షోరూం ధర రూ.4.69 లక్షలతో ప్రారంభం అవుతుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 68ps పవర్, 91Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీట్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.