Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ బెస్ట్ మూవీస్ ఇవే

Ott Trending

Ott Trending

ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ కొన్ని డైరెక్ట్ ఓటిటి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.. ప్రత్యేకంగా వీకెండ్ రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు హాలిడేస్. ఫ్యామిలీతో రిలాక్స్ అవుదామని చూస్తున్న ప్రేక్షకుల కోసం… స్టోరీ ఓరియెంటెడ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్డ్‌గా కొన్ని సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి

3 రోజెస్ : స్పెషల్లీ యూత్ కోసం రూపొందిన 3 రోజెస్ సీజన్ 2 ఓటిటిలో రిలీజ్ అయింది. రాశీ సింగ్, ఖుషిత, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో వచ్చిన 3 రోజెస్ కి ఇది సీక్వెల్ సిరీస్ ఇది.  డిసెంబర్ 13 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో హర్ష, సత్య పాత్రలు కూడా కంటెంట్‌కి కొత్త లేయర్‌ జోడించబోతున్నాయి.

కాంత : దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా కాంత. నవంబర్ 14న థియేటర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజ్‌ డైరెక్షన్ లో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే మెయిన్ లీడ్ లో నటించగా సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు.

కలివి వనం : తెలంగాణ జానపదాల సోయగాన్ని తెరపైకి తీసుకువచ్చి ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఇప్పుడు హీరోయిన్‌గా మెరిసిన ‘కలివి వనం’ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Win లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది.

ఆరోమలే : తమిళ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కిషన్ దాస్ , శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ, ఇద్దరు వేర్వేరు భావాలున్న అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే రిలేషన్షిప్ జెర్నీని క్యూట్‌గా ప్రజెంట్ చేశారు. డిసెంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

గుడ్ బై జూన్ : గుడ్ బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ ముందురోజే అంటే డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. 

Exit mobile version