Site icon NTV Telugu

Health Tips: వైట్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

White Tea

White Tea

గ్రీన్ టీ తెలుసు, బ్లాక్ తెలుసు.. కానీ వైట్ టీ ఉంటుందన్న విషయం కొందరికి తెలియదు. సాధారణంగా చాలా మంది టీ తాగడం అలవాటే. కానీ వైట్ టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలిసుండదు. వైట్ టీ తాగడం వలన ముఖ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది.. అంతేకాకుండా ముఖంపై కనపడే వృద్దాప్యాన్ని కనపడకుండా దోహదపడుతుంది. ఇదిలా ఉంటే.. వైట్ టీ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు.. మన శరీరంలోని అనేక వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ రకాల కాటెచిన్స్ కలిగి ఉంటాయి. వైట్ టీలో టానిన్లు, ఫ్లోరైడ్, ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. వైట్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఎన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

E-Challan Scam: ఈ చలాన్‌ల డబ్బు మాయం.. ఎంతటి వారైనా వదిలేది లేదంటున్న పోలీసులు

బరువు తగ్గుతారు
చాలా మంది శరీర బరువు తగ్గించుకోటానికి ఎక్కువగా గ్రీన్ టీ ని తాగుతారు. కానీ వైట్ టీ కూడా శరీర బరువును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది తాగితే అస్సలు ఆకలి వేయదు. దాంతో ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతారు.

మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది
వైట్ టీలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్, ఫారెన్ పార్టికల్స్ ను నియంత్రిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం పై ఉండే మచ్చలను, ముడతలను మరియు ఫైన్ లైన్స్ ని తగ్గిస్తాయి.

యవ్వనంగా కనిపిస్తారు
వైట్ టీ తాగడం వలన యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై చర్మం వేలాడుతూ.. వృద్దాప్య చర్మం ఉన్నవారు ఈ టీ తాగితే అందంగా కనిపిస్తారు. ఒకవేళ ఉదయం ఈ వైట్ టీ తాగితే.. రోజు అంతా తాజాగా.. ఎనర్జిటిక్ గా ఉంటారు.

అలసట ఉండదు
వైట్ టీ తాగటం వలన రిఫ్రెష్ అవుతారు. అంతేకాకుండా అలసట కూడా తగ్గుతుంది. ఈ టీ తాగే వారు ఎక్కువ శాతం తీపి పదార్థాలు తినడానికి ఇష్టపడరు. దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.

గ్యాస్ ను దూరం చేస్తుంది.
అజీర్ణం సమస్యలతో బాధపడేవారికి వైట్ టీ ఒక దివ్యౌషధం. ఇది మలబద్ధకం, గ్యాస్‌ను దరిచేరకుండా సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి పెంచుతుంది
వైట్ టీలో ఉండే పాలీఫెనాల్స్ జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ లను దూరం చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ వైట్ టీని తాగాలి. వైట్ టీ తాగటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో హై బీపీ, మధుమేహం, గుండెపోటు సమస్యలు కలిగే ప్రమాదం తగ్గుతుంది.

Exit mobile version