NTV Telugu Site icon

International Yoga Day 2024: వృద్ధులు రోజూ తప్పకుండా చేయాల్సిన ఆసనాలు ఇవే..

New Project (5)

New Project (5)

పిల్లలు, యువతకు కంటే 60 ఏళ్ల పైబడి వృద్ధులకు యోగా చాలా అవసరం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తమ జీవనశైలిలో యోగాను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, 60 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా చేయగలిగే యోగాసనాల గురించి తెలుసుకుందాం.

READ MORE: ESI Hospital: దిక్కున్న చోట చెప్పుకోండి.. ఈఎస్ఐలో రోగులపై సిబ్బంది జులుం

1. బాలాసన..
ముందుగా ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి. ఈ భంగిమను కనీసం 30 సెకన్ల పాటు వేసినా చాలు మీరు ఈ భంగిమలో 1 నుంచి 3 నిమిషాలు ఉండవచ్చు. ఇది రోజుకు కనీసం 5 సార్లు చేయాలి. ఈ ఆసనం శరీరానికి విశ్రాంతినిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది.

READ MORE: India vs Pakistan: భారత్- పాకిస్తాన్ ప్రత్యక్ష చర్చలకు సపోర్ట్ ఇస్తాం..

2. తాడాసనం..
అన్నింటిలో మొదటిది.. తాడాసనం. ఇది ఎలా చేయాలో చూడండి. నేలపై నేరుగా నిలబడండి. మీ రెండు పాదాలను ఒకచోట చేర్చి, మీ రెండు అరచేతులను మీ పక్కన పెట్టుకోండి. మొత్తం శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీర బరువును రెండు కాళ్లపై సమానంగా ఉంచండి. ఆ తర్వాత రెండు అరచేతుల వేళ్లను కలిపి తలపైకి తీసుకోవాలి. అరచేతులను నిటారుగా ఉంచండి. చేతులను పైకి లాగండి. ఇది మీ భుజాలు, ఛాతిని కూడా సాగదీస్తుంది. దీనితో పాటు, పాదాల మడమలను కూడా పైకి లేపండి. కాసేపు ఆగిన తర్వాత శ్వాస వదులుతూ మామూలు స్థితికి చేరుకోండి. ఈ ఆసనం శరీరానికి సమతుల్యత మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. తడసానం చాలా సులభం. 60 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా చేయవచ్చు.

READ MORE: Pawan Kalyan : వారంలో రెండు రోజులే.. పవన్ కల్యాణ్ షాకింగ్ డెసిషన్..?

3. శవాసన..
నేలపై తివాచీ లేదా yoga mat పరిచి, వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు రెండూ… ఒకటి, లేదా రెండు అడుగులు వెడల్పు చేయాలి. బొటనవేళ్ళు (toes) రెండు బైటకు చూస్తున్నట్లు వుండాలి. మడమలు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండాలి. మనకు విశ్రాంతిగా హాయిగా వుంటుందనుకున్నంతవరకు కాళ్ళను పెట్టవలసిన వెడల్పును నిర్ణయించుకోవచ్చు. రెండు చేతులూ (hands) శరీరానికి కొంచెం దూరంగా అరచేతులు పైకి కనిపించేలా వుంచాలి. ఏవైపునకు వుంచితే హాయిగా ఉంటుందో ఆ వైపుకి మెడను (neck) తిప్పి ఉంచాలి. కళ్ళు మూసుకుని, దృష్టిని శరీరంపై కేంద్రీకరించి మామూలుగా శ్వాస (breathe) తీసుకోవాలి. విశ్రాంతి స్థితి వైపే మనస్సు కేంద్రీకరించి, శ్వాస మామూలుగా తీసుకోవాలి.శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. ఈ ఆసనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తడి దూరమవుతుంది.